24 February, 2018 | Category : NEWS

మార్చ్ టు సంచారభవన్ న్యూఢిల్లీ కార్యక్రమము విజయవంతము.

కామ్రేడ్స్ , బి యస్ యన్ యల్ యూనియన్స్ మరియు అసోసియేషన్స్ పిలుపు ప్రకారము ఈ రోజు జరిగిన మార్చ్ టు సంచారభవన్ న్యూఢిల్లీ పోరాట కార్యక్రమం విజయవంతం అయింది. దేశ నలుమూలలు నుండి 7000 మంది పైగా ఈ కార్యక్రమంలో  పాల్గొన్న కామ్రేడ్స్ అందరికి ఆంధ్ర ప్రదేశ్ సర్కిల్ తరుపున విప్లవాభినందనలు తెలియజేస్తూంది. ర్యాలికి ముందు ఈస్టరన్ కోర్టు, బియస్ యన్ యల్ కార్పోరేట్ ఆఫీసు దగ్గర జరిగిన సభలో సి ఐ టి యు, ఏ ఐ టి యు సి మరియు ఐ యన్ టి యు సి నాయుకులు పాల్గొని మన పోరాటానికి మద్దతు తెలిపారు.  ఈస్టరన్ కోర్టు, జనపద్ ,టాల్ స్టాయ్ మార్గ్ , పార్లమెంటు స్ర్టీట్ మీదగా ర్యాలి కొనసాగింది. పార్లమెంటు స్ట్రీట్ పోలీసు స్టేషన్ వద్ద మన ర్యాలీని పోలీసులు అడ్డుకొన్నారు అక్కడ మన ర్యాలీని ముందుకు పోనీయకుండా పెద్ద బ్యారికేడ్స్ ను ఏర్పాటుచేసారు.కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బ్యారికేడ్స్ ను తొలిగించుకొని సంచార భవన్ వైపు దూసుకు వెళ్లటానికి మన కామ్రేడ్స్ తీవ్ర ప్రయత్నం చేసారు. డి.వొ.టి అధికారులను మేము కలవాలి మాసమస్యను చెప్పాలి, మాకు అవకాశం ఇవ్వండని పోలీసులతో వాగ్వివివాదము జరిగింది.  మీకు డి.వొ.టి అధికారులతొ సమావేశాన్ని ఏర్పాటు చేయిస్తామని పోలీసు అధికారులు హామీ ఇచ్చారు. అయినా కాని మన కామ్రేడ్స్ బ్యారికేడ్స్ ను తొలిగించుకొని ముందుకు పొవటానికి ప్రయత్నం చేసారు. పెద్డ స్ధాయిలో మొహరించిన పోలీసులు మన ర్యాలీని ముందుకు పోనీయకుండా అడ్డుకొన్నారు. ఉద్రిక్త వాతావరణాన్ని గమనించిన మన నాయుకులు జోక్యం చేసుకొని అక్కడనే మన సమావేశం చేయటం జరిగింది. ఆ సమావేశంలో యూనియన్లు మరియు అసోసియేషన్లు నాయకులు సందేశాలు యిచ్చి మన కర్తవ్యాన్ని తెలియజేసారు. అనంతరం డి ఓటి సెక్రటరీ మరియు స్పెషల్ సెక్రటరీ తదితరులు యానియన్లు, అసోసియేషన్ల నాయకులతో డిమాండ్ల పై చర్చించారు. ఈ రోజు (24.2.2018) 12.30 కు యూనియన్లు, అసోసియేషన్లతో వేతన సవరణ తదితర డిమాండ్ల పై కమ్యూనికేషన్స్ మంత్రి శ్రీ మనోజ్ సిన్హా మరియు డి ఓటి సెక్రటరీ శ్రీమతి అరుణా సుందరరాజన్ చర్చిస్తారు. బి ఎస్ ఎన్ ఎల్ లాంగ్ లివ్ !!! ఉద్యోగుల అధికారుల ఐక్యత వర్ధిల్లాలి !!! ఐక్య ఉద్యమాలు వర్ధిల్లాలి!!! పి అశోక బాబు, సర్కిల్ సెక్రటరీ, బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయిస్ యూనియన్ ఆంధ్ర ప్రదేశ్ సర్కిల్

RELATED POSTS :

24 May, 2018 | Category : NEWS

జయప్రదముగా జరిగిన సర్కిల్ కార్యవర్గ

బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమా

READ MORE