12 October, 2018 | Category : NEWS

9.10.2018 న జరిగిన వేతన సవరణ చర్చలు

మేనేజిమెంటు మరియు యూనియన్ ప్రతినిధులందరూ హాజరయ్యారు. ఎన్ఇ-4 మరియు ఎన్ఇ-5 పేస్కేల్సు మ్యాగ్జిమమ్ ని మరి కొంత పెంచాలని యూనియన్ ప్రతినిధులు చేసిన ప్రతిపాదనకు మేనేజిమెంటు ప్రతినిధులు అంగీకరించ లేదు. 10.9.2018న మేనేజిమెంటు పక్షం ప్రతిపాదించిన పే స్కేల్సుని ఆమోదించటం జరిగింది. అనంతరం పెర్క్స్ & ఎలవెన్సుల పై చర్చ జరిగింది. రివైజ్డ్ పే స్కేల్స్ పై హెచ్ఆర్ఏ ని ఇవ్వలేమని, బిఎస్ ఎన్ ఎల్ ఆర్థిక పరిస్థితి బాగా లేనందున 31.12.2016 నాటి హెచ్ఆర్ ఏ ని కొనసాగిస్తామని ఎగ్జిక్యూటివ్ ల వేతన సవరణ విషయం లో బి ఎస్ ఎన్ ఎల్ బోర్డు డిఓటి కి ప్రతిపాదనని పంపించిందని, కాబట్టి నాన్ ఎర్జిక్యూటివ్ లకి కూడా ఇదే ప్రతిపాదన పంపిస్తామని, పే రివిజన్ ప్రకారం హెచ్ ఆర్ ఏ ని రివైజ్ చేయాలంటే అందుకు రు.570 కోట్లు అదనముగా ఖర్చు అవుతుందని, ఇందుకు డిఓటి అంగీకరించదని మేనేజిమెంటు ప్రతినిధులన్నారు. హెచ్ఆర్ ఏ అనేది పే లో ఒక భాగం కాబట్టి దానిని పే రివిజన్ కి అనుగుణముగా పెంచాలని యూనియన్ ప్రతినిధులన్నారు. హెచ్ ఆర్ ఏ ని స్తంభింప జేయాలనే ఈ ప్రతిపాదనని యూనియన్ ప్రతినిధులందరూ ఏకగ్రీవముగా వ్యతిరేకించారు. హెచ్ఆర్ ఏ విషయంలో ఏకాభిప్రాయం లేనందున ముందుకు పోయే పరిస్థితి లేదు. చర్చలలో ఏర్పడిన ఈ ప్రతిష్టంభన తో సమావేశం ముగిసింది. ........... బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్

RELATED POSTS :

12 October, 2018 | Category : NEWS

pay scales signed

pay scales signed

READ MORE

12 October, 2018 | Category : NEWS

JE Training schedule

JE Training schedule starting from 22-10-2018

READ MORE