24 November, 2018 | Category : NEWS

3.12.2018 నుండి నిరవధిక సమ్మెజయప్రదమయ్యేందుకు చేయాల్సిన కార్యక్రమాలు

వేతన సవరణ, పెన్షన్ సవరణ, బేసిక్ పే పై పెన్షన్ కంట్రిబ్యూషన్, బి ఎస్ ఎన్ ఎల్ కు 4 జి స్పెక్ట్రమ్, రెండవ పీఆర్సీ లో వదిలివేయబడిన సమస్యల పరిష్కారం –ఈ ఐదు డిమండ్స్ కోసం 3.12.2018 నుండి నిరవధిక సమ్మెకి ఏయూఎబి (అల్ యూనియన్స్ & అసోసియేషన్స్ ఆఫ్ బిఎస్ఎన్ఎల్) 15.11.2018న డి ఓ టి సెక్రెటరీకి, బిఎస్ఎన్ఎల్ సిఎండి కి నోటీసునిచ్చింది. 20.11.2012న ఢిల్లీ లో జరిగిన ఏయు ఏబి సమావేశం సమ్మె జయప్రదం అయ్యేందుకు ఈ క్రింది కార్యక్రమాలను నిర్ణయించింది: 1) సిహెచ్ క్యూ నాయకుల పర్యటన: ఏయుఏబి యూనియన్ల సి హెచ్ క్యూ నాయకులు సర్కిల్స్ పర్యటించి మీటింగ్స్ లో ప్రసంగిస్తారు. ఏ.పి సర్కిల్ మీటింగు విజయవాడ లో 29.11.2018న జరుగుతుంది. బిఎస్ఎన్ఎల్ఈయు తరఫున అసిస్టెంట్ జనరల్ సెక్రెటరీ కా. ఎస్. చెల్లప్ప హాజరవుతారు. ఇతర యూనియన్ల, అసోసియేషన్ల నాయకులు కూడా హాజరవుతారు. 2) సమ్మె పోస్టర్లు వేసి విస్తృత ప్రచారం చేయాలి. 3) 30.11.2018న రౌండ్ టేబుల్ సమావేశాల నిర్వహణ: ఇన్సూరెన్సు, బ్యాంకులు, పోస్టల్, కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల నాయకులను మరియు సిఐటియు, ఏఐటియుసి, ఐ ఎన్ టి యు సి, తదితర కేంద్ర కార్మిక సంఘాల నాయకులను ఆహ్వానించి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సు నిర్వహించి వారికి మన డిమాంద్సును మనము ఎందుకు పోరాడుతున్నాము వివరించి మన పోరాటానికి మద్దతు కోరాలి. 4) 1.12.2018 నుండి వీధి సమావేశాలు నిర్వహించి బిఎస్ఎన్ఎల్ పై ప్రభుత్వ దాడిని వివరించి బి ఎస్ ఎన్ ఎల్ ను కాపాడుకోవాల్సిన అవసరాన్నివివరించి అందుకు సంబంధించిన కరపట్రాలు ఇచ్చి ప్రజల మద్దతు కోరాలి. 5) అసెంబ్లీ ఎన్నికల డ్యూటీ: తెలంగాణ, రాజస్తాన్ తదితర రాష్ట్రాలలో ఎన్నికల డ్యూటీ లో వున్న వారిని ఎన్నికల డ్యూటీ రోజులలో మాత్రమే సమ్మె నుండి మినహాయింపు ఇవ్వాలి. ఈ నిర్ణయాల అమలుపై 24.11.2018న సర్కిల్ ఏయూఎబి సమావేశం లో చర్చించి మరిన్ని వివరాలు తెలియజే స్తాము. ప్రతి ఉద్యోగీ సమ్మేలో పాల్గొనేలా చూడాలి. ఇందుకోసం అన్ని యూనియన్లు,అసోసియేషన్లు సమైక్యముగా పని చేయాలి. ఇందుకు అన్ని జిల్లాల్లో బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ చొరవతో పని చేయాలి.

  1. 3122018 నుండి నిరవధిక సమ్మె సర్క్యుల్ర్ 1 - Copy (2).docx : Download File

RELATED POSTS :