13 December, 2017 | Category : NEWS

సమ్మె ఘనవిజయం- తదుపరి పోరాట కార్యక్రమం పై 8.1.2018 న నిర్ణయం

సమ్మె ఘనవిజయం- తదుపరి పోరాట కార్యక్రమం పై 8.1.2018 న నిర్ణయం- ఢిల్లీలో నేడు అన్ని యూనియన్ల, అసోసియేషన్ల సమావేశం జరిగింది. రెండు రోజుల సమ్మె చారిత్రాత్మక స్థాయిలో విజయవంతం చేసినందుకు నాన్ ఎగ్జిక్యూటివ్సు మరియు ఎగ్జిక్యూటివ్సుకు అభినందనలు తెలియజేసింది. సమ్మెకు వ్యతిరేకముగా మేనేజిమెంటు చేసిన ప్రయత్నాలను ఉద్యోగులు తిప్పికొట్టినందుకు అభినందనలు తెలియజేసింది. సమ్మె జయప్రదమయ్యేందుకు అవిశ్రాంతముగా కృషి చేసిన అన్ని యూనియన్ల, అసోసియేషన్ల అన్ని స్థాయిల నాయకులకు ధన్యవాదాలు తెలియజేసింది. సమ్మె నోటీసునిచ్చిన అనంతరం యూనియన్లు, అసోసియేషన్ల నాయకులతో చర్చలు జరిపే కనీస ధర్మాన్ని కూడా పాటించన మేనేజిమెంటు మరియు డిఓటి వైఖరిని సమావేశం తీవ్రముగా ఖండించింది. తదుపరి కార్యక్రమంపై చర్చించింది. కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి. 8.1.2018న జరుగు తదుపరి సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. రెండురోజుల సమ్మె జయప్రదం చేసిన నాన్ ఎగ్జిక్యూటివ్సు మరియు ఎగ్జిక్యూటివ్సు అందరికి బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆంధ్ర ప్రదేశ్ సర్కిల్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. బి ఎస్ ఎన్ ఎల్ పరిరక్షణకు, వేతన సవరణ సాధించేందుకు మరింత తీవ్రమయిన పోరాటానికి సంసిద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అభినందనలతో, బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్, ఆంధ్రప్రదేశ్ సర్కిల్

RELATED POSTS :

6 June, 2018 | Category : NEWS

All India Conference at Mysuru from 4th to 7th January, 2019

The Agartala CEC meeting has already decided to hold the next All India Conference at Mysuru. Taking various factors into consideration, the Karnata

READ MORE