24 May, 2018 | Category : NEWS

జయప్రదముగా జరిగిన సర్కిల్ కార్యవర్గ సమావేశం, సెమినార్

బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం మరియు “బిఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ , జాతీయ డిజిటల్ కమ్యూనికేషన్స్ విధానం, 2018 ముసాయిదా” పై సెమినార్ 2018 మే 18,19 తేదీల్లో విజయవాడ లో మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రం లో జరిగింది. ఆల్ ఇండియా అసిస్టెంట్ జనరల్ సెక్రెటరీ కా. ఎస్.చెల్లప్ప ప్రసంగించారు. ఆగర్తలా లో ఏప్రిల్ 3-5, 2018 న జరిగిన కేంద్ర కార్యవర్గ సమావేశం నిర్ణయాలను, వేతన సవరణ, బిఎస్ఎన్ఎల్ పరిరక్షణ, టవర్ కంపెనీకి వ్యతిరేకముగా జరిగిన ఉద్యమం తదితర అంశాలపై వివరించారు. “బిఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ మరియు జాతీయ డిజిటల్ కమ్యూనికేషన్స్ పాలసీ 2018 ముసాయిదా” పై సెమినార్ జరిగింది. ఈ సెమినార్ లో సర్కిల్ కార్యదర్శి కా.పి.అశోకబాబు, ఏ.పి.సర్కిల్ జి ఎం ( హెచ్ ఆర్) శ్రీ వై.రవీంద్రనాథ్ ప్రసంగించారు. బిఎస్ఎన్ఎల్ ను దెబ్బ తీసే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకముగా పోరాడా, అదే సందర్భములో వినియోగ దారులకు మెరుగైన సేవలందించేందుకు మరింత పట్టుదలతో పని చేయాలని కా. పి.అశోక బాబు అన్నారు. “పని చేయండి, పోరాడండి” అనే నినాదాన్ని స్వీకరించుదామని ప్రతిపాదించారు. అందుకు సభ ఆమోదించింది. సర్కిల్ కార్య వర్గ సమావేశం ఈ క్రింది నిర్ణయాలు చేసింది: 1. బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ మద్దతుతో బిఎస్ఎన్ఎల్ క్యాజువల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ & లేబర్ యూనియన్, ఏపీ మరియు తెలంగాణా శాఖల అధ్వర్యములో మార్చి 27న సమ్మె చేసి ఎస్టిఆర్ కాంట్రాక్టు వర్కర్లు మేనేజిమెంటు ప్రతిపాదించిన 30 శాతం తొలగింపును ఆపగలిగారు. మే నెలలో యూనియన్ తో చర్చించే వరకు ఎవరిని తొలగించమని ఎస్ టి ఆర్ మేనేజిమెంటు హామీ ఇచ్చింది. ఈ చర్చలు సఫలమవుతాయని ఆశిస్తున్నాము. ఒక వేళ సఫలము కాక పోతే ఎస్ టి ఆర్ కాంట్రాక్టు వర్కర్లు నిరవధిక సమ్మె కి నిర్ణయించారు. కాబట్టి ఈ సమ్మె కి అన్ని జిల్లాలలో బి ఎస్ ఎన్ ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ పూర్తి సహాయ సహకారాలను అందిస్తుంది. 2. ఇంతవరకు ఏఐబిడిపిఏ ( ఆల్ ఇండియా బి ఎస్ ఎన్ఎల్ డి ఓ టి పెన్షనర్స్ అసోసియేషన్ ) జిల్లా శాఖలు ఏర్పడని జిల్లాలు వెంటనే ఏర్పాటు చేయాలి. ఏ ఐ బి డి పి ఏ సర్కిల్ సెక్రెటరీ కా.కె.ఎస్.సి బోస్ ను ( మొబైల్ నం. 94412 21188) సంప్రదించి పెన్షనర్సు మీటింగు తేదీ ని నిర్ణయించాలి. ఈ మీటింగు కు పెద్ద ఎత్తున పెన్షనర్సు ను సమీకరించాలి. జులై 31 లోగా ఇది అమలు జరగాలి. 3. ఇంతవరకు బి ఎస్ ఎన్ ఎల్ క్యాజువల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ & లేబర్ యూనియన్ ఏర్పాటు జరగని జిల్లాలలో వెంటనే ఏర్పాటు చేయాలి. సర్కిల్ సెక్రెటరీ కా.టి.ధర్మారావు ను (మొబైల్ నం. 9491122212) సంప్రదించి మీటింగు తేదీ ని నిర్ణయించాలి. ఈ మీటింగు కు పెద్ద ఎత్తున క్యాజువల్, కాంట్రాక్ట్ వర్కర్లను సమీకరించాలి. జులై 31 లోగా ఇది అమలు జరగాలి. 4. ప్రజాసంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యములో అన్ని రాష్ట్రాల రాజధానులలో మే 23, 2018 న మోడి ప్రభుత్వ ప్రజావ్యతిరేక ఆర్థిక విధానాలకు, మతం పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టే శక్తులకు వ్యతిరేకముగా జరుగు ప్రద్ర్శనాలలో పాల్గొనాలని బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ పిలుపునిచ్చింది. ఈ పిలుపుననుసరించి 23.5.2018 న విజయవాడలో జరుగు ప్రదర్శన, సభలో పాల్గొనాలి. 5. అగర్తలాలో 3-5 ఏప్రిల్ 2018 కేంద్ర కార్యవర్గ సమావేశం ఇచ్చిన పిలుపుననుసరించి జూన్ 2018 లో బిఎస్ఎన్ఎల్ యువ ఉద్యోగుల సదస్సును రాష్ట్ర స్థాయిలో నిర్వహించాలి. 6. సర్కిల్ యూనియన్ తరఫున తెలుగు మాస పత్రికని ప్రచురించాలి. 7. హైదారాబాద్ కు మెడికల్ ట్రీట్మెంటు కు వెళ్ళే వారికి సర్కిల్ ఆఫీసు ద్వారా కాకుండా జిల్లా జి ఎం నేరుగా పర్మిషన్ ఇచ్చే విధముగా చూడాలి. 8. ఒంగోలు-గుంటూరు జిల్లాలను బిజినెస్ ఏరియా పేరుతో మెర్జీ చేయాలని ఇదే విధముగ శ్రీకాకుళం-విజయనగరం లను బిజినెస్ ఏరియా పేరుతో మెర్జీ చేయాలనే ప్రతిపాదనల అమలును బి ఎస్ ఎన్ ఎల్ ఈయు, ఎస్ఎన్ఈఏ, ఏఐబిఎస్ఎన్ఎల్ ఈఏ తదితర యూనియన్లు/అసోసియేషన్లు వ్యతిరేకించినందున ఆగిపోయింది. కానీ ఇప్పుడు ఎన్ఎఫ్ టిఈ సర్కిల్ యూనియన్ ఈ ప్రతిపాదనలు అమలు చేయాలని తీర్మానించింది. బిఎస్ఎన్ఎల్ ఈయు ఇందుకు వ్యతిరేకం. కాబట్టి కలిసి వచ్చే అందరినీ కలుపుకుని ఈ ప్రతిపాదనల అమలును ఆపాలి. 9. బిఎస్ఎన్ఎల్ పునరుద్ధరణకు అనుగుణముగా ప్రభుత్వ విధానాలను మార్చేందుకు పోరాడాలని, మరో వంక వినియోగ దారులకు మెరుగైన సేవలందించేందుకు వినియోగ దారుల సంఖ్య పెంచేందుకు తద్వారా మార్కెట్ లో బిఎస్ఎన్ఎల్ వాటా పెంచేందుకు మరింత మెరుగైన పద్ధతిలో పని చేయాలని ఈ సమావేశం నిర్ణయించింది. ఇందుకోసం “ పని చేయండి-పోరాడండి” అనే నినాదాన్ని మరింత మెరుగైన రీతిలో అమలు చేయాలని బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు ఈ సమావేశం పిలుపునిచ్చింది.

  1. Circular on CEC 1.pdf : Download File

RELATED POSTS :

6 June, 2018 | Category : NEWS

All India Conference at Mysuru from 4th to 7th January, 2019

The Agartala CEC meeting has already decided to hold the next All India Conference at Mysuru. Taking various factors into consideration, the Karnata

READ MORE