28 October, 2018 | Category : PAMPHLETS

మూడవ వేతన సవరణ - బి యస్ యన్ యల్ రక్షణ కోసం ప్రెస్స్ మీట్స్ , ధర్నాలు మరియు  ర్యాలీలను నిర్వహించండి. ఆల్ యూనియన్స్ & అసోసియేషన్స్ ఆఫ్   బి ఎస్ ఎన్ ఎల్. పిలుపును జయప్రదం చేయండి !

మూడవ వేతన సవరణ - బి యస్ యన్ యల్ రక్షణ కోసం ప్రెస్స్ మీట్స్ , ధర్నాలు మరియు  ర్యాలీలను నిర్వహించండి. ఆల్ యూనియన్స్ & అసోసియేషన్స్ ఆఫ్   బి ఎస్ ఎన్ ఎల్. పిలుపును జయప్రదం చేయండి ! డిమాండ్స్ : 1. 1-1-2017 నుండి 3 వ వేతన సవరణ చేయాలి. 2. పెన్షన్ కంట్రిబ్యూషన్ లెక్కించే విషయంలో గవర్నమెంటు రూల్సును అమలు చేయాలి. 3. మేనేజ్ మెంటు ప్రతిపాదనల ప్రకారము బి యస్ యన్ యల్ కు ప్రభుత్వము 4 జి స్పెక్ర్టమ్ ను ఉచితంగా ఇవ్వాలి. 4. 1-1-2017 నుండి పెన్షనర్లకు పెన్షన్ రివిజన్ చేయాలి. 5. రెండవ వేతన సవరణలో అమలు కాకుండా మిగిలిపోయిన సమస్యలను పరిష్కరించాలి.          ఫిబ్రవరి 24 న ఢిల్లీలో ఏయుఏబి నాయకత్వంలో డిఓటి ఆఫీసు, సంచార భవన్ వద్ద   బి యస్ యన్ యల్ ఉద్యోగులు, అధికారులు భారీ ప్రదర్శన చేసిన అనంతరము, కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖా మంత్రి శ్రీ మనోజ్ సిన్హా గారు పైన వివరించిన డిమాండ్స్ మీద చర్చలు జరిపారు. పే రివిజన్ కు కేబినెట్ ఆమోదం కోసం డిఓటితో కేబినెట్ నోట్ ను తయారు చేయించి కేబినెట్ ఆమోదం కోసం పంపించి, ఆమోదం చేయించి   బి యస్ యన్ యల్ ఉద్యోగులకు పే రివిజన్ యిప్పించుతామని మంత్రి హామీ నిచ్చారు. ఈ సమస్యే కాకుండా మిగతా సమస్యలను పరిష్కరించుతానని మంత్రి హామీనిచ్చారు. ఈ సమస్యలు త్వరగా పరిష్కారం కావటానికి డిఓటి అధికారులతో ఏయుఏబి - బి యస్ యన్ యల్ నాయుకులు తరచుగా సమావేశమయి ఇన్ పుట్స్ ను అందించాలని ఆదేశాలిచ్చారు. ఆ తరువాత కేబినెట్ నోటు కోసం చర్చించుదామని, డిఓటి సెక్రటరీ/అధికారులతో సమావేశం కోసం అనేక సార్లు ఏయుఏబి నాయుకులు ప్రయత్నించారు. కానీ, ఏయుఏబి నాయుకులను కలవటానికి డిఓటి సెక్రటరీ నిరాకరించారు. డిఓటి వైఖరిని నిరసిస్తూ, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేందుకు, 11-7-2018 న దేశ వ్యాప్తంగా ప్రదర్శనలు మరియు 24-7-2018 నుండి 26-7-2018 వరకు భారీ రిలే నిరాహార దీక్షలు దేశవ్యాప్తంగా  జరిగినాయి. అయినా డిఓటి అధికారులలో ఎటువంటి చలనము లేదు.            8 నెలలు గడచినా డిఓటిలో బి యస్ యన్ యల్ ఉద్యోగుల మరియు అధికారుల పే రివిజన్ మీద కేబినెట్ నోటును ఇంత వరకూ తయారుచేయలేదు.  బి యస్ యన్ యల్ ఉద్యోగుల/ అధికారుల యెడల డిఓటి మరియు మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహిరిస్తున్నారు.             ఈ నేపధ్యంలో, 24-2-2018 న హామీ ఇచ్చిన కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖా మంత్రి దగ్గర నుండి గానీ, మంత్రి సమక్షంలో కేబినెట్ నోట్ తయారుచేస్తామన్న డిఓటి అధికారులు/సెక్రటరీ దగ్గర నుండి గానీ, ఎటువంటి సమాధానం లేనందున, ఈ విషయాలన్నింటిని చర్చంచటానికి 8-10-2018 న ఢీల్లీలో ఏయుఏబి   బి యస్ యన్ యల్ నాయుకులు సమావేశమయి డిమాండ్స్ పరిష్కారము కోసం క్రింది ఆందోళనా కార్యక్రమాలను దేశవ్యాప్తంగా కార్పోరేట్ ఆఫీసు ముందు, అన్ని సర్కిల్ ఆఫీసుల ముందు మరియు జిల్లా జి యమ్ ఆఫీసుల ముందు భారీ స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించారు. ఆందోళనా కార్యక్రమాల నోటీసును 17-10-2018 న డిఓటి సెక్రటరీకి మరియు సి యమ్ డి బి యస్ యన్ యల్ కి అందచేసారు. 30-11-2018 లోపులో సమస్యలు పరిష్కారం కాకపోతే సమ్మెను నిర్వహించుతామని ఏయుఏబి నాయుకులు చెప్పారు. ఆందోళనా కార్యక్రమాలు: 1. 29-10-2018 న సర్కిల్ మరియు జిల్లా స్దాయిలలో ప్రెస్స్ మీట్స్ ను నిర్వహించాలి. 2. 30-10-2018 న కార్పోరేట్ ఆఫీసు, సర్కిల్ ఆఫీసుల మరియు జిల్లా ఆఫీసుల ముందు భారీ ధర్నాలను నిర్వహించాలి. 3. 14-11-2018 న  సర్కిల్ స్దాయిలో మరియు జిల్లా  స్దాయిలో భారీ ర్యాలీలను నిర్వహించాలి. 4. 30-11-2018 లోపుల సమస్యలు పరిష్కారం కాకుంటే, సమ్మెకు సమాయత్తం కావాలి. సమ్మె తేదీలను త్వరలో నిర్ణయిస్తారు.               పై కార్యక్రమాలన్నింటిని జిల్లాలో నున్న మిగతా యూనియన్స్ మరియు అసోసియేషన్స్ నాయుకులతో సమన్వయము చేసుకుని సమర్ధవంతంగా నిర్వహించాలి. అభినందనలతో.... పి.అశోకబాబు సర్కిల్ కార్యదర్శి, బి యస్ యన్ యల్ ఇ యు ఆంద్రప్రదేశ్

  1. JAC circulr final PDF (1).pdf : Download File

RELATED POSTS :

5 January, 2019 | Category : PAMPHLETS

Detailed explanation on demands and working class alternative

Detailed explanation in Telugu on demands and working class alternative

READ MORE

3 January, 2019 | Category : PAMPHLETS

Booklet on General Strike on 8th and 9th January 2019

Booklet in Telugu by Com. Asoka Babu on General Strike on 8th and 9th January 2019

READ MORE